బీబీ జోడి ప్రతీ వారం ఏదో ఒక కాంట్రావర్సీతో ఆడియన్స్ అటెంషన్ ని తమ వైపు తిప్పుకుంటోంది. రాబోయే వారం ఎపిసోడ్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. నెక్స్ట్ వీక్ థీమ్ "డైరెక్టర్స్ స్పెషల్".
ఇక ఇందులో ఒక్కో పెయిర్ డాన్స్ ని ఇరగదీశారని చెప్పాలి. మెహబూబ్ – శ్రీ సత్య ఇద్దరూ డైరెక్టర్ త్రివిక్రమ్ స్పెషల్ అని చెప్పి రోబోటిక్ పెర్ఫార్మెన్స్ చేసి చూపించారు. ఐతే ఆరియానా వీళ్ళ డాన్స్ మీద రియాక్ట్ అయ్యింది.."త్రివిక్రమ్ గారికి డేడికేట్ చేస్తున్నామన్నారు..కానీ మాకు శంకర్ గారి రోబో కనెక్ట్ ఐన ఫీల్ వచ్చింది" అంది. "నేను కూడా త్రివిక్రమ్ అంటే వేరే ఎక్స్పెక్ట్ చేసాను" అంది భానుశ్రీ.."త్రివిక్రమ్ స్టైల్ అంటే ఎట్లా ఉండాలని మీ ఆలోచన" అని వెంటనే సదా అడిగేసింది. "త్రివిక్రమ్ స్టైల్ అంటే ఆలా వైకుంఠపురం స్టైల్" అని అవినాష్ చెప్పాడు. "మెడ్లే ఉండాలి మేడం నాలుగు పార్టులు తీసుకుని కొట్టేస్తే అదే డాన్స్ మేడం...కానీ త్రివిక్రమ్ గారు ఒక వేళ ఇది చూస్తే నా సాంగ్ కి రోబోలా బాగా చేశారురా అనిపించాలి కదా మేడం" అని మెహబూబ్ కన్విన్సింగ్ గా చెప్పాడు. "కొట్టేవాళ్ళు చప్పట్లు కొడుతున్నారు మా దాంట్లో పాయింట్స్ లేవా అండి...ఎందుకు ఒక పాయింట్ లో పెట్టేసి, కొట్టేసి, హైప్ ఇచ్చేసి..వాట్ ఐస్ థిస్ " అని ఫైర్ అయ్యింది ఆరియానా. ఇంతలో పక్కనుంచి భానుశ్రీ ఏడ్చేసింది. ఎందుకు ఏడ్చిందో తెలీదు.
తర్వాత అర్జున్ కళ్యాణ్ - వాసంతి టీం హాట్ పెర్ఫార్మెన్స్ చేశారు. డాన్స్ ఐపోయాక "రొమాంటిక్ పెర్ఫార్మెన్స్ కాబట్టి నాకు ఇంకొంచెం డాన్స్ మూవ్మెంట్స్ ఉంటే లిఫ్టింగ్ లు, రొమాంటిక్ స్టెప్స్ ఉంటే" అన్నాడు అవినాష్. "మీకు ఎవరు చెప్పారు ఇది డాన్స్ కాదు అని" అని సదా ఫైర్ అయ్యింది. తర్వాత ఆరియానా-అవినాష్ జోడి మధ్య వార్ జరిగింది. " మీరు పదికి పది మార్కులు ఇచ్చుకుంటే ఇచ్చుకోండి. నేను ఇంక ఈ షో చేయను" అని అవినాష్ మైక్ అక్కడ పెట్టేసి షోలోంచి లేచి వెళ్ళిపోయాడు.